ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

ఠాగూర్

సోమవారం, 7 జులై 2025 (20:09 IST)
ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని తల్లిదండ్రులను లెక్క చేయకుండా పారిపోయేవారు కొందరైతే.. తల్లిదండ్రులనే హతమార్చే వారు మరికొందరు. అయితే సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది.

కాగా చనిపోయిన యువతిని రమ్యగా, యువకున్ని ప్రవీణ్‌గా గుర్తించారు. యువతి మెడపై కత్తి నాట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారా? లేక యువతిపై ప్రవీణ్‌ దాడి చేసి ఆపై ఆత్మహత్యకు యత్నించాడా అనేది తెలియాల్సి ఉంది.

ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు రమ్య డిగ్రీ చదువుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆకుల ప్రవీణ్, రమ్య ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వారి ప్రేమకు రమ్య తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో బ్లేడుతో కోసుకుని ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు