శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణి మూతపడింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణిని మూసివేస్తారు. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు.
నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను పుష్కరిణిని మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. పుష్కరిణిలో నీటిని తొలగించి మరమ్మత్తులు చేపడుతున్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పుష్కరిణిలో మరమ్మత్తులు కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.