పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం..?

శనివారం, 6 జనవరి 2018 (13:14 IST)
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్టిందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. 2017లో హుండీ ఆదాయ వివ‌రాల‌ను ఓసారి పరిశీలిస్తే.. 2016 కంటే 2017 హుండీ ఆదాయం త‌గ్గింద‌ని తెలిపింది.
 
ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన నోట్ల ర‌ద్దేనని తెలుస్తోంది. ఏడాది మొత్తానికి రూ. 995.89 కోట్లు హుండీ ఆదాయం వ‌చ్చింది. ఈ  ఆదాయం.. 2016 ఆదాయం రూ. 1046.28 కోట్లతో పోల్చితే దాదాపు రూ. 50 కోట్లు త‌క్కువని తితిదే వెల్లడించింది. 
 
నోట్ల ర‌ద్దు త‌ర్వాత ర‌ద్దైన నోట్ల‌ను హుండీలో వేయ‌డం వ‌ల్ల ఆదాయం తగ్గిందని టీటీడీ అధికారుల అంచనా. ఇంకా ఆన్‌లైన్‌లోనే వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు పెరిగిపోతున్నాయని వారు అన్నారు. జీఎస్టీ ఎఫెక్ట్ కూడా హుండీ ఆదాయంపై పడిందని తితిదే అధికారులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు