Lunar Eclipse: చంద్రగ్రహణం: 12 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం

సెల్వి

శనివారం, 6 సెప్టెంబరు 2025 (19:51 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మూతపడనుంది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ (ఆదివారం) శ్రీవారి ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూతపడనుంది. ఈ కారణంగా, భక్తులకు దాదాపు 15 గంటల పాటు స్వామివారి దర్శన భాగ్యం ఉండదని స్పష్టం చేసింది.
 
సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 గంటల నుంచి, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు ఆలయం మూసివేత కొనసాగుతుంది. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. 
 
ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రహణం ముగిసిన తర్వాత, సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, దర్శనాలను యథావిధిగా పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
 
ఆలయం మూసివేత సందర్భంగా అన్ని రకాల ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలపై జారీచేసే దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు