lunar eclipse, బెంగళూరు నెత్తిపైన 327 నిమిషాల పాటు సుదీర్ఘ చంద్రగ్రహణం

ఐవీఆర్

శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (12:21 IST)
సెప్టెంబరు 7,8 తేదీలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశ వ్యాప్తంగా గోచరిస్తుందని జవహర్ లాల్ నెహ్రూ ప్లానెటోరియం తెలియజేసింది. ఐతే భారతదేశంలోని అన్ని నగరాలకంటే బెంగళూరులో అత్యధికంగా ఈ చంద్రగ్రహణ సమయం వుంటుందని తెలిపింది. చంద్రగ్రహణం 7వ తేదీ రాత్రి 8:58 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
 
అర్థరాత్రి అంటే... 8వ తేదీన 12:22 నిమిషాలకు క్రమంగా గ్రహణం తగ్గుతుంది. మొత్తంగా వేకువ జామున గం 2:25కి చంద్ర గ్రహణం విడుస్తుంది. ఐతే భారతదేశం లోని బెంగళూరు నగరంలో చంద్రగ్రహణాన్ని మొత్తం 327 నిమిషాల పాటు సుదీర్ఘ చంద్రగ్రహణం చూడవచ్చని చెబుతున్నారు. మన దేశంతో పాటు పొరుగు దేశాల్లో కూడా చంద్రగ్రహణం కనబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు