అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.