అనంతరం 6.30 గంటలకు స్వామి వారికి తోమాల సేవ, సహస్రనామార్చన సేవలు నిర్వహించనున్నారు. ఈ సేవల కాలంలో భక్తులకు లఘు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు, 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.
సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతించరు. రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే గోవింద రాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో భక్తులకు దర్శనాలను రద్దు చేశారు. భక్తులు విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ్