గురు, శుక్ర, శనివారాల్లో అయితే పూర్తిగా రద్దు చేయాలనుకున్నప్పటికీ దివ్యదర్శనం టోకెన్లను తిరిగి ప్రారంభించారు. అది కూడా రెండు గంటల్లోనే కాలినడక భక్తులకు దర్శనం పూర్తయ్యేలా చూడనున్నారు. వారాంతంలో రద్దు చేసిన టిక్కెట్లను తిరిగి ఇవ్వనున్నారు. అది కూడా 20 వేల టోకన్లు మాత్రమే.
అలిపిరి పాదాల మండం నుంచి నడిచి వెళ్లే భక్తులకు 14వేలు, శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తులకు 6 వేల టోకన్లను ఇవ్వనున్నారు. మొదట్లో తితిదే తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడినా ఆ తరువాత తప్పును సరిదిద్దుకుని టోకన్లను ఇవ్వడమే కాకుండా ఎంత రద్దీ ఉన్నా రెండు గంటల్లోనే స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా తితిదే చర్యలు తీసుకోవడం భక్తుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.