శ్రీవారి సేవలకు రమణ దీక్షితులు... సన్నిధి గొల్లలకు న్యాయం...?

సోమవారం, 27 మే 2019 (12:44 IST)
గత తెలుగుదేశం సర్కారు తీసుకున్న నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రధాన అర్చక విధుల నుంచి రమణ దీక్షితులు తప్పుకోవాల్సి వచ్చింది. గతంలో అమల్లో ఉన్న మిరాసీ వ్యవస్థను తితిదే రద్దు చేసింది. ఆ తర్వాత గత యేడాది మే 16వ తేదీన తితిదే పాలక మండలి సమావేశమై 65 యేళ్ళ పైబడిన అర్చకులకు పదవీ విరమణ విధానాన్ని వర్తింపజేశారు. దీంతో రమణదీక్షితులు తన విధులు కోల్పోవాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే పదవీ విరమణ విధానాన్ని రద్దు చేయడంతో పాటు సన్నిధి గొల్లలకు న్యాయం చేస్తామంటూ జగన్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇపుడు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు. 
 
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పదవీ విరమణ రద్దు విధానాన్ని రద్దు చేసిన పక్షంలో రమణ దీక్షితులు వంటి అనేక మంది అర్చకులు తిరిగి విధుల్లో చేరనున్నారు. అంటే, తితిదే ప్రధాన అర్చక వృత్తిలో ఉన్న రమణ దీక్షితులు తిరిగి ఇపుడు అదే వృత్తిలో విధులు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలన్నింటిలోనూ ఉన్న సమస్యల పరిష్కారంపై జగన్ దృష్టిసారించాలని అర్చకులు కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు