ఏడుకొండలవాడా గోవిందా గోవిందా, మరో బ్రహ్మోత్సవానికి రెడీ, ఈసారి భక్తులు కూడా?

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:57 IST)
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పరిమిత సంఖ్యలో గల భక్తులతో ఈ బ్రహ్మోత్సవాల వాహన సేవల ఊరేగింపు నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. అయితే వాహనసేవలు ఎప్పుడెప్పుడు జరుగనున్నాయో తెలుసుకుందాం.
 
ఈనెల 15వ తేదీ గురువారం అంకురార్పణ. రాత్రి 7 గంటలకు జరుగనుంది. గంట పాటు అంకురార్పణ జరుగనుంది. 16వ తేదీ శుక్రవారం బంగారు తిరుచ్చి ఉత్సవం.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక పెద్దశేష వాహనం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగనుంది.
 
అలాగే 17వ తేదీ శనివారం చిన్నశేష వాహనం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగనుంది. హంస వాహనం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగనుంది. 18వ తేదీ ఆదివారం ఉదయం సింహ వాహనం ఉదయం  8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగనుంది.
 
ముత్యపుపందిరి వాహనం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగనుంది. 19వ తేదీ సోమవారం కల్పవృక్షవాహనం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగనుంది. సర్వభూపాల వాహనం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగనుంది. 
 
20వ తేదీ మంగళవారం మోహినీ అవతారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు టిటిడి నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాల్లోనే ప్రధాన ఘట్టం గరుడ సేవ రాత్రి 7నుంచి 12 గంటల వరకు జరుగనుంది. 
 
21వ తేదీ బుధవారం హనుమంత వాహనసేవ, పుష్పక విమానం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరుగనుంది. రాత్రి గజవాహనం జరుగనుంది. 22వ తేదీ సూర్యప్రభవాహనం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగనుంది.
 
చంద్రప్రభ వాహనం అదేరోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు జరుగనుంది. 23వ తేదీ శుక్రవారం స్వర్ణ రథోత్సవం ఉదయం 8 గంటలకు జరుగనుంది. అశ్వవాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగనుంది. 
 
24వ తేదీ శనివారం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు, స్నపన తిరుమంజనం మరియు చక్రస్నానం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు జరుగనుంది. బంగారు తిరుచ్చి ఉత్సవం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు