ట్రస్ట్ బోర్డు నిర్మాణం, పదవీకాలం, నిధులు, నియామకాలు, బదిలీలకు సంబంధించిన సేవా నియమాలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) హోదాకు సంబంధించిన వివరణాత్మక నోట్‌ను మంత్రివర్గానికి సమర్పించారు. ఈ ఆలయాన్ని ఎండోమెంట్స్ చట్టం, 1987లోని 14వ అధ్యాయం కింద చేర్చారు. దీనికి సంబంధించిన సవరణను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
ఆలయ కార్యనిర్వాహక అధికారిగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి లేదా అదనపు కమిషనర్ హోదా లేదా అంతకంటే ఎక్కువ స్థాయి అధికారిని నియమిస్తారని క్యాబినెట్ నోట్ పేర్కొంది. ట్రస్ట్ బోర్డులో ఒక ఛైర్మన్- పది మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒక వ్యవస్థాపక ట్రస్టీ- ప్రభుత్వం నామినేట్ చేసిన తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. అదనంగా, ఎక్స్-అఫీషియో సభ్యులు ఉంటారు.