వంద కోట్లతో మైసూరుకు కొత్త సొగసులు

బృందావనం అనే పేరు వినని వారుండరు. ఈ మాట చెప్పగానే చప్పున జ్ఞాపకమొచ్చేది మైసూరు. అంతేనా ఇంకేమి లేవా అంటే ఉన్నాయి. మహరాజా ప్యాలెస్, దసరా పండుగ దేశ వ్యాప్తంగా ఫేమస్. ఈ నగరం పర్యాటకులకు పెట్టింది... పేరు.

ఇలాంటి నగరం రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులోంచి దాదాపు రూ.50 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.50 కోట్లు వచ్చే యేడాది ఖర్చు చేయనున్నారు.

ఇందులో భాగంగానే వంద ఎకరాలలో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో వినియోగించే డ్రైవర్లకు శిక్షణవంటి కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్రకేంద్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వం దాదాపు రూ. 30 కోట్ల విడుదల చేయనున్నది.

వెబ్దునియా పై చదవండి