ఆకాశంలో హంసలమై.. అలా... అలా...

"పెళ్లంటే నూరేళ్ల పంట" అని మన తెలుగు కవి అంటే... "మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవన్" అని అన్నాడో ఆంగ్ల పండితుడు. వీరి మాటలను అలా ఉంచితే ఇప్పుడు కొత్త జంటలు, "మ్యారేజెస్ ఆర్ మేడ్ బిట్వీన్ ఎర్త్ అండ్ స్కై" అంటున్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా...అయితే మీరు ఆ వివరాలను చూడాల్సిందే...

భూమిపై చేసుకునే వివహాలు పాతపడినట్లు భావించారో ఏమో రెండు జంటలు ఆకాశంలో ఏకమవుదాం అని నిర్ణయించుకున్నాయి. ఆలోచన వచ్చిందే తడవుగా భూమ్యాకాశాల మధ్య వివాహ వేదికను సిద్ధం చేసుకున్నాయి. బెల్జియం దేశానికి చెందిన వధూవరులు శాంద్రాయన్, జేరూన్ కిప్పర్లు పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి బంగీ జంప్ చేశారు.

ఆ తర్వాత బంధువుల సమక్షంలో గాలిలో తేలిపోతూ భూమికి 50 అడుగుల ఎత్తులో వివాహం చేసుకున్నారు. ఆ క్షణాలు మరువలేనివని వారు చెపుతున్నారు. గాలిలో వివాహాన్ని చూడటం తమకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని వధూవరుల బంధువులు అంటు్న్నారు. గాలిలో తేలుతూ ఎంచక్కా వివాహాన్ని చేసుకున్న ఆ జంటలను వీడియోలో చూడండి.

వెబ్దునియా పై చదవండి