రష్యన్ అమ్మాయి... వరంగల్ అబ్బాయి

ప్రేమకు కులమతాలే కాదు జాతులు కూడా అడ్డుకావని నిరూపించింది ఓ జంట. వివరాల్లోకి వెళితే... వరంగల్ లో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గౌతమ్, ఎమ్‌బీబీఎస్ చదువుకోసం రష్యా వెళ్లాడు. కాలేజీలో మెరీనా అనే అమ్మాయితో పరిచయమయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

దీంతో తన తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం తెలియజేసి, మెరీనాను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఒకే కుమారుడు కావడంతో వారు గౌతమ్ కోరికను తిరస్కరించలేకపోయారు. అయితే పెళ్లి మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం సొంత ఊరిలో జరగాలని తెలిపారు.

మెరీనా తల్లిందండ్రులు వారి కోర్కె ప్రకారం తమ అమ్మాయిని ఉక్రెయిన్ నుంచి వరంగల్‌కు తీసుకువచ్చి, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. హిందు స్త్రీ కట్టూ బొట్టులను ధరించిన మెరీనా, ఈ సంప్రదాయం తనకెంతో నచ్చిందని చెప్పింది. ఒకవైపు మన దేశ యువతీ యువకులు పాశ్చాత్య వేషధారణపై అమితమైన మోజు ప్రదర్శిస్తుంటే... మెరీనా మాత్రం హిందువుల వేష ధారణ చాలా బావుందని చెప్పటం పెళ్లికి హాజరైన వారికి ముచ్చటగొలిపింది.

వెబ్దునియా పై చదవండి