చాప కింద నీరులా మహిళా తీవ్రవాదం

FileFILE
'కంటికి కన్ను.. పంటికి పన్ను'. ఈ తీవ్రవాద పంథాను నమ్మే వారు వర్తమాన ప్రపంచంలో అనేక మంది. ఆ అనేక మందిలో సహజంగానే మహిళల సంఖ్య తక్కువ. ముఖ్యంగా మన దేశంలో వీరు చాలా అరుదు. అందుకే ఇటీవల విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ప్రజ్ఞా సింగ్‌ ఠాగూర్‌ను మాలేగావ్‌ పేలుళ్ల కేసులో అదుపులోకి తీసుకున్నప్పుడు సంచలనం కలిగింది. ప్రజ్ఞ పాత్రపై నిగ్గు తేలాల్సి వుంది. అదే సమయంలో ఒక సంప్రదాయ ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఉగ్రవాద పంథాలోకి తనను తాను ఇనుమడింపజేసుకోవడానికి గల కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తమకు అత్యంత సన్నిహితులైన వారు ఉగ్రవాదదాడుల్లో విగతజీవులుగా మారినపుడు వారిపై ఉన్న ప్రేమానురాగాల వల్ల మహిళలు తీవ్రవాదం వైపు నడిచేలా చేస్తుందని మానసిక నిపుణుల భావన. 1980- 90లలో కాశ్మీర్‌లో అనేక మంది మహిళా మిలిటెంట్లు ఉండేవారు. ఆ తర్వాత వారి సంఖ్య క్రమేణా తగ్గిపోయింది. భద్రతా సంస్థలు, నిఘా సంస్థల దృష్టి నుంచి తప్పించుకోవటం మహిళలకు సులభం.

దీనిని ఆధారంగా చేసుకొనే పాలస్తీనా, శ్రీలంక, తదితర దేశాల్లో అనేక ఉగ్రవాద సంస్థలు మహిళలను తమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ మన దేశంలో ఉగ్రవాదానికి మరో కొత్త కోణాన్ని చేర్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా దేశ చరిత్రను ఒకసారి పరికిస్తే.. మరికొంతమంది మహిళలు తీవ్రవాద ముద్ర వేసుకున్నారు. అలాంటి మహిళల చరిత్ర గురించి తెలుసుకుందాం.

బందిపోటు రాణి.. ఫూలన్‌దేవి
బందిపోటు రాణిగా పేరు పొందిన ఫూలన్‌ దేవి కూడా మధ్యప్రదేశే. చంబల్‌ లోయలో తిరుగులేని బందిపోటుగా పేరు గాంచిన ఫూలన్‌..1981లో బహిమా ఊచకోతత
FileFILE
ప్రపంచ దృష్టినే ఆకర్షించింది. ఈ ఊచకోతలో 21 మంది ఠాకూర్‌లను కాల్చి చంపిన ఫూలన్‌ ఆ తర్వాత చాలా కాలం తప్పించుకుని తిరిగింది. 1983లో ప్రభుత్వానికి లొంగిపోయింది. 11 ఏళ్లు జైలులో గడిపింది. 1996లో రాజకీయాల్లోకి ప్రవేశించి ఏకంగా ఎంపీ కూడా అయింది. చివరికి ఢిల్లీలోనే హత్యకు గురైంది.

సాధ్వి ముసుగులో... ప్రజ్ఞా సింగ్‌
కాషాయ వస్త్రాలు ధరించి.. అచ్చం సాధువులా కనిపించే.. ప్రజ్ఞాసింగ్‌ను చూస్తే.. ఆమె కరుడుగట్టిన తీవ్రవాది అని ఊహించలేరు. పది మంది సాధువుల మధ్యలో ప్రజ్ఞా సింగ్‌ను చూస్తే గుర్తుపట్టడమూ కష్టమే. రుషికేష్‌, హరిద్వార్‌లలో కనిపించే అనేక మంది మహిళా సాధువుల్లో ఆమె ఒకటి. ఈమె కూడా పుట్టి పెరిగిందీ.. మధ్యప్రదేశ్‌లోనే. తండ్రి చంద్రపాల్‌ సింగ్‌ ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉన్నత ఉద్యోగి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీరాభిమాని. దీంతో ప్రజ్ఞాసింగ్.. తన చిరు ప్రాయం నుంచే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి ఆకర్షితురాలైంది. డిగ్రీ చదువుతున్నప్పుడే భాజపా అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో చేరారు.

ఆ తర్వాత ఆమె భజరంగ్‌ దళ్‌ మహిళా విభాగం దుర్గా వాహినిలో చురుకైన పాత్ర పోషించటం మొదలుపెట్టింది. ఇస్లామిక్‌ టెర్రరిజంను అడ్డుకోవటానికి ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై ఆమె చేసిన ప్రసంగాలకు విస్తృత ఆదరణ లభించింది. గతంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజ్ఞ చురుకుగా పాల్గొంది. మాలేగావ్‌ పేలుళ్ల దర్యాప్తులో భాగంగా ప్రజ్ఞాసింగ్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ బృందం అరెస్టు చేసింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

ఇదే తరహాలో.. అంతర్జాతీయ స్థాయిలోనూ మహిళా తీవ్రవాదులు ఉన్నారు. ఈ కోవలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హతమార్చేందుకు మానవబాంబుగా మారిన థానుకు అగ్రస్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఉగ్రవాద కార్యకలాపాలకు మహిళలను సమర్థంగా ఉపయోగించుకున్న తొలి సంస్థ ఎల్‌టీటీఈ అని చెప్పొచ్చు.

అంతర్జాతీయ పత్రిక జేన్స్‌ డిఫెన్స్‌ వీక్లి ప్రకారం... 1980 నుంచి 2000 సంవత్సరం వరకు ఎల్‌టీటీఈ సంస్థ సుమారు 60 మంది మహిళలను ఆత్మాహుతి దళ సభ్యులుగా ఉపయోగించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా.. చరిత్రలో పేరుమోసిన మహిళా ఉగ్రవాదుల్లో ప్యాట్రికా (అమెరికా), జర్మనీకి చెందిన ఉగ్రవాద సంస్థ రెడ్‌ ఆర్మీ ఫ్యాక్షన్‌ (ఆర్‌ఏఎఫ్‌) వ్యవస్థాపకురాలు యుల్‌రైక్‌ మినిహాఫ్‌‌లు ఈ కోవకు చెందినవారు.