అసలు లక్ష్యం నెరవేరుతుందా?

సోమవారం, 15 సెప్టెంబరు 2008 (16:20 IST)
FileFILE
వార్త : తల్లి తెలంగాణ పార్టీ అధినేత్రి విజయశాంతితో తాను సమావేశమైన మాట నిజమేనన్న తెరాస చీఫ్ కేసీఆర్ తెలంగాణ శక్తుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని నవ తెలంగాణ పార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్‌తో సైతం చర్చిస్తామని తెలిపారు.

చెవాకు : తెలంగాణకోసం అన్నీ పార్టీలను కలుపుకుని పోవడం వరకు బాగానే ఉంది కానీ ఇదెంతకాలం ఇలా సాగుతుందో ఆలోచించండి. అందరికీ దానిపైనే (ముఖ్యమంత్రి పదవి) దృష్టి ఉందనే విషయం తెలుసుకుంటే మంచిది.

గెలిచేంతవరకు తెలంగాణ ఐక్యత కోసం పాట పాడినా ఆ తర్వాత ఎవరు గొప్ప అనే పోటీ ఏర్పడవచ్చు. ఇప్పటికే నరేంద్రతో ఏర్పడిన గొడవనుంచి బయటపడేందుకు చాలా కష్టపడ్డారనుకుంటాం.

గెలిచే మాట, ఎన్నికల్లో పోటీ చేసే సమయంలోనే కూడా ఆధిపత్యం గురించిన వివాదం ఏర్పడవచ్చు. ఎవరెక్కువ సీట్లలో పోటీ చేయాలనే గొడవ కూడా రావచ్చు. ఇదీ చాలదన్నట్టు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తే టీడీపీతో పొత్తుకు కూడా సై అంటున్నారు.

ఇలా అందరికీ తెలంగాణ సీట్లు సర్దేస్తే మీకు ఎన్ని సీట్లు దొరుకుతాయో ఆలోచించుకోంది. మరీ జాగ్రత్త పడకుంటే ఇంకా ప్రమాదంలో పడగలరు. మీరు సీటు లేదంటే ఆ సీటు కోసం మీ పార్టీ వారే ఇతర పార్టీల్లోకి జారుకోగలరు.

వెబ్దునియా పై చదవండి