ఏమిటీ అడ్మిషన్ల గోల?

గురువారం, 11 సెప్టెంబరు 2008 (16:31 IST)
FileFILE
వార్త : ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఇంటర్నెట్ ఆధార ఎంపిక ప్రక్రియ జాబితాలో అధికారుల పొరబాట్లతో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

చెవాకు : తమకు ఎక్కడ సీటు దొరుకుతుందోనని ఆశతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసే విద్యార్థులతో చెలగాటమెందుకు? మీ (అధికారులు) నిర్లక్ష్యంతో వారిని ఇబ్బందులకు గురి చేయడం మీకు సబబుగా ఉందా?

వారి కోణంలో నుంచి ఎందుకు ఆలోచించరు. మీ పిల్లలకు ఈ పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారో ఆలోచించండి. ఏదో అనాలోచితంగా జరిగిన తప్పే అనుకున్నా ఇంతమందిపై ప్రభావం చూపే విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారో మీరే చెప్పాలి.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించి జాబితాను పక్కాగా రూపొందించినప్పటికీ దానిని ఇంటర్నెట్‌లో ఎక్కించే సమయంలోనే పొరబాటు జరిగిందని మీరు చెబుతున్న ప్రకారం ఈ మొత్తం గందరగోళానికి మీదే బాధ్యతగా పరిగణించాల్సి ఉంటుంది. కనీసం ఇకనైనా బాధ్యత నెరిగి మసలుకోండి.

వెబ్దునియా పై చదవండి