వార్తః ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 6500 జడ్పీ, పురపాలక ఉన్నత పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
చెవాకుః అభినందనీయమే. అయితే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగిపోతాయంటారా? పిల్లల చదువుకోసం ప్రైవేటు పాఠశాలల్లో వేలు దారబోస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు ఊరట నివ్వగలదా? ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేరుస్తారని గ్యారంటీగా చెప్పగలరా? డిమాండ్ల కోసం పోరాటాలు, యూనియన్ల పేరుతో రాజకీయాలు మాని భావి తరానికి బాట చూపగలరా? తమ కన్నా ఎందరో అసలు తిండికి కూడా అవస్థలు పడుతున్నారని తెలుసుకుని, వారి కుటుంబాల్లో జ్యోతి వెలిగించగలరా?