మీరెందుకు దిగుతారు

మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (17:21 IST)
FileFILE
వార్త : విపక్షాల నుంచే కాక మిత్రపక్షాల నుంచి సైతం వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం కోరితే తప్ప తాను హోం మంత్రి పదవి నుంచి వైదొలగబోనని శివరాజ్ పాటిల్ అన్నారు.

చెవాకు : మీరెందుకు దిగుతారు చెప్పండి. గత పర్యాయం లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన మీకు అసలు ఆ పదవి రావడమే గొప్ప అదృష్టం. ఏదో విధేయుడిగా ఉంటారనే కారణంతో ఎవరికీ లేని ప్రాధాన్యాన్ని మీ పార్టీ అధినేత్రి మీకిచ్చారు.

నట్వర్ సింగ్ విషయంలో నైనా బయటకు పంపేందుకు సాహసం చేశారు కానీ మీలాంటి విధేయుడిని ఎలా బయటకు పంపగలరు చెప్పండి. సమావేశమైన ప్రతిసారీ నాలుగు ఉచిత సలహాలు పారేసే మిమ్మల్ని వదులుకోవడం అంత తేలిక కాదనే విషయం ఆమెకూ తెలుసు.

కానీ దేశ రాజధానిలోనే ఇంత భారీ స్థాయిలో పేలుళ్లు జరిగి, పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగితే కనీసం మాట వరసకైనా నైతిక బాధ్యత వహించి ఉంటే బావుండేది. పేలుళ్లు జరుగుతాయనే విషయం మోడీ చెప్పక ముందే తెలుసు కానీ ఎక్కడ అనే విషయం తెలియక పోయిందని చెప్పడం ద్వారా తప్పించుకోవాలనుకుంటే ఎలా సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి