ఇంతకు మించిన భాగ్యం దొరకడం కష్టమే

వార్తః 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకై ఎన్టీఆర్ ప్రారంభించిన రథయాత్రకు సారథిగా వ్యవహరించిన హరికృష్ణ నేడు చంద్రబాబు రథయాత్రకూ సారథిగా వ్యవహరిస్తున్నారు.

చెవాకుః ఎంతైనా బావగారు కదా! వద్దనుకుని ఆనాడు మిమ్మల్ని వదిలేసినా, మళ్లీ కావాలనుకునేగా రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు.

మీకూ ఎలాగూ పార్టీ సారధ్యం నిర్వహించే సత్తా లేదని స్వీయ అనుభవాలతో (అన్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ద్వారా) తెలుసుకున్నారు. మీరు రథం నడపడం, బాబు పార్టీ నడపడం ఉభయతారకంగానే ఉంది. మీకు ఇంతకు మించిన భాగ్యం (గత్యంతరం) మరేముంటుంది?

వెబ్దునియా పై చదవండి