సెక్రటరి: "అమాత్యులవారికి జయము... జయము!! మీ ఆనతి మేర మన అనుచరగణం దేశం నలుమూలలా శోధించి కొన్ని వినూత్న ప్రచార విధానములను తెలుసుకొని వచ్చిరి. మీరు అంగీకరించిన యెడల వాటిని మీ ముందు ఉంచెదము" -అన్నాడు పాశ్వాన్ వారి సెక్రటరి
సెక్రటరి: నేటి ఆధునిక పద్ధతి అయిన ఆల్ఫా బెటికల్ ప్రకారం... ముందుగా మీకు ఆంధ్రదేశమున అనుసరించే విధానములను వివరించెదము. వై.ఎస్ రాజశేఖర రెడ్డివారు పదవిని చేపట్టక ముందు పాదయాత్రను చేసి అనూహ్యమైన విజయాన్ని కైవసం చేసుకొని యున్నారు. అలాగే ... ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వారు 'ప్రజలతో ముఖ్యమంత్రి' పేరిట దూరదర్శినిలో ప్రజల సమస్యలపై ప్రత్యక్ష ప్రసారం గావించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఇహ సింహగర్జన, మహాగర్జన... వంటి 'గర్జన' సభలైతే కోకొల్లలు. ఆ తర్వాత అరుణాచల ప్రదేశము విషయానికి వస్తే....
పాశ్వాన్: సమయం మించి పోతున్నది. మీ ప్రసంగాన్ని ఆపి, పాటలీ పుత్రంలో నేను తలపెట్టవలసిన ప్రణాళిక ఏమిటో తక్షణం తెలుపండి.
సెక్రటరి- అధికారులు: ??????????? పాశ్వాన్: ఏవిటీ...? ఎవరూ చెప్పలేరా?.... అని తల పంకించి... అధికారులారా.. అందుకోండి... ఆ మృదంగాన్ని! అనుచరులారా... తరలిరండి... నా వెంట!! అంటూ మృదంగాన్ని తీసుకుని మెడలో వేసుకుని 'సంకల్ప్' పేరిట 'తలుపు తలుపుకీ పిలుపు' అన్న నినాదంతో వెడలెన్ పాశ్వాన్‌జీ.
గమనిక: ఇది కేవలం ఊహాజనిత కథనం మాత్రమే... ఎవరినీ కించపరచటమో.. అపహాస్యం చేయటం మా ఉద్దేశ్యం కాదని గమనించగలరు.