సెప్టెంబర్ 29న "ఐస్ ల్యాండ్ వాటర్ పార్క్" ప్రారంభం..!!

మనం ఇప్పటి వరకూ సహజంగా ఏర్పడిన జలపాతాలను చూశాం. ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం నయాగరా కూడా సహజంగా ఏర్పడిందే..! అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్‌ఫాల్‌ను మనుషులు సృష్టించారు. దీనిని సందర్శించాలంటే మీరు దుబాయ్ వరకూ వెళ్లి రావల్సిందే మరి. మీ కోసం ఈ జలపాతం వింతలు, విశేషాలు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని "రాస్ అల్ ఖైమా" ప్రాంతంలో ఈ కృత్రిమ జలపాతాన్ని నిర్మించారు. దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ జలపాతం ప్రజలను అలరించనుంది. అరేబియన్ గల్ఫ్ తీర ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్, పెంగ్విన్ల రక్షణ వంటి అంశాల ద్వారా ప్రభావితమై ఈ జలపాతాన్ని నిర్మించారు.

ఈ వాటర్ పార్క్ దాదాపు 1,10,000 ఎకరాల్లో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మనుషులు తయారు చేసిన వాటర్‌ఫాల్‌గా నిలువనుంది. ఇందులో రైన్ డాన్స్ పూల్‌తో పాటు వాటర్ రైడ్స్, వాటర్ గేమ్స్ వంటి 50కు పైగా అద్భుతమైన జల క్రీడలను ఇందులో ఏర్పాటు చేశారు.

ఇది రోజుకు 10,000 మందికి పైగా అతిధులకు ఆతిధ్యం ఇస్తుంది. ఈ వాటర్‌ఫాల్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐస్-థీమ్డ్ వాటర్ పార్క్‌ను పోలో రాక్ అమ్యూజ్‌మెంట్ నిర్వహిస్తుంది. ఇది భారత్‌కు చెందిన పోలో అమ్యూజ్‌మెంట్ గ్రూప్, రాక్ ప్రాపర్టీస్, రాక్ ఇన్వెస్టిమెంట్ అథారిటీలతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ నిర్మాణాన్ని చేపట్టింది.

ఈ ప్రాజెక్టు కోసం 100 మిలియన్ డాలర్లను వెచ్చించారు. కాబట్టి మీరెప్పుడైనా దుబాయ్ వెళితే ఈ జలపాతాన్ని తప్పక సందర్శించండి. ఇక్కడి వాతావరణాన్ని సందర్శకులు చాలా బాగా ఆనందిస్తారని నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి