చైనా మార్కెట్ ఎఫెక్టు : సెన్సెక్స్ 1090 - నిఫ్టీ 350 పాయింట్ల నష్టం

సోమవారం, 24 ఆగస్టు 2015 (11:25 IST)
చైనా మార్కెట్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి భారత స్టాక్ మార్కెట్‌లో సోమవారం బ్లాక్ మండేగా నమోదైంది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1090 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేసుకోగా, నిఫ్టీ 350 పాయింట్లపైగా పతనాన్ని నమోదు చేసింది. 
 
చైనా ఆర్థిక ప్రగతిపై అనుమానాలతో గ్లోబల్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం భారత స్కాక్ మార్కెట్లపై కనిపించింది. దీనికితోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీ పతనాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం ముగింపుతో పోల్చితే 65 పైసలు తగ్గి రూ.66.47 పైసల వద్ద ప్రారంభమైంది. ఈ క్రమంలో రూపాయి విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.

వెబ్దునియా పై చదవండి