'ఆన్‌లైన్‌'లో "హాటెస్ట్ స్టార్" సానియా

బుధవారం, 19 డిశెంబరు 2007 (12:09 IST)
FileFILE
ఆన్‌లైన్ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనకు కావాల్సిన ప్రతి సమాచారాన్ని ఒక్క క్లిక్‌తోనే పొందగలుగుతున్నాం. ప్రముఖుల ఫోటోలను సైతం ఇందులో అత్యంత సులభంగా ఎంపిక చేసుకుని డౌన్ లౌడ్ చేసుకునే సౌకర్యం ఉంది. అలా గత ఏడాది అత్యధికంగా భారత బ్రౌజర్లు సెర్చ్ చేసిన ఫోటోలలో సానియా మీర్జా అగ్రస్థానంలో ఉంది. ఈమె ఫోటోల కోసం.. బ్రౌజర్లు భారీ సంఖ్యంలో సెర్చ్ చేసినట్టు ప్రముఖ ఆన్‌లైన్ ఇంజిన్ ప్రకటించింది.

అంతేకాకుండా.. రాజకీయనాయకుల పరంగా జాతిపిత మహాత్మాగాంధీ ఫోటోలను సెర్చ్ చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే.. చిత్ర సీమలో ముఖ్యంగా బాలీవుడ్‌లో హీరోల ఫోటోల కంటే.. హీరోయిన్ల ఫోటోల కోసమే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు పేర్కొంది. ఇకపోతే ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లోనే సినిమాలను డౌన్ లోడ్ చేసుకునే వారి సంఖ్య అధికమైనట్టు ఆ సంస్థ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి