ఇంగ్లీష్ స్టార్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్‌కు బట్టతలట..!?

FILE
ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్‌ కొంతకాలంగా హెయిర్ కటింగ్‌కు నో చెబుతున్నాడట. సాకర్ ప్రపంచంలోనే తన అందచందాలు, ఆటతీరుతో ప్రేక్షకులు, మగువలను ఆకట్టుకునే బెక్‌హామ్.. ఇటీవల పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడట.

సాకర్ ప్రపంచంలో ఆట కంటే విభిన్న హెయిర్ స్టైల్స్‌తో క్రేజ్ సంపాదించిన బెక్‌హామ్.. జుట్టు కట్ చేయపోవడానికి కారణమేమని ఆరాతీస్తే.. బెక్ కొంతకాలం బట్టతలను కప్పిపుచ్చుకునేందుకు నానాతంటాలు పడుతున్నాడనే విషయం తెలియవచ్చింది.

బెక్ ఓ హెయిర్ స్టయిలిస్ట్ సహాయంతో బట్టతలను కప్పిపుచ్చుకునేందుకు ఇబ్బంది పడిపోతున్నాడని, మరికొద్ది రోజుల్లో బెక్‌కు దువ్వెనతో అవసరం తీరిపోనుందని బ్రిటన్‌లో పత్రికలు చెబుతున్నాయి. కాగా.. మాజీ స్పెస్ గర్ల్ విక్టోరియాను 11 ఏళ్ల క్రితం పెళ్లాడిన బెక్‌హామ్‌కు ముగ్గురు కుమారులున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ సేల్స్‌ఉమెన్‌తో రాసలీలలు సాగించినట్లు ఓ పత్రిక వెల్లడించింది. 10,000 డాలర్ల మొత్తాన్నిచ్చి సేల్స్‌ఉమెన్‌తో బెక్‌హామ్ శృంగార క్రీడ నిర్వహించినట్టు యూఎస్ మ్యాగజైన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇంకా ఓ కాళ్‌గర్ల్ నిషితో బెక్‌హామ్ ఓ రాత్రి గడిపినట్లు ఆ మ్యాగజైన్ ప్రచురించింది.

అయితే ఈ వార్తలో అవాస్తవమని బెక్ హామ్ కొట్టిపారేశాడు. అంతేకాదు.. అసత్యపు వార్తలను ప్రచురించిన ఆ మ్యాగజైన్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. అసత్యపు వార్తలపై న్యాయపరమైన చర్యలు సిద్ధమైన బెక్‌హామ్.. హెయిర్ స్టైల్‌పై ఏం చేస్తాడో వేచి చూడాలి...!

వెబ్దునియా పై చదవండి