ఏటీపీ ర్యాంకింగ్స్ : ఎనిమిదో స్థానంలో పేస్

మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (17:35 IST)
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత డబుల్స్ ఆటగాడు లియాండర్ పేస్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ముగిసిన అమెరికా ఓపెన్‌ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెల్చుకోవడం ద్వారా పేస్ ఈ ర్యాంక్ సాధించడానికి వీలైంది.

అమెరికా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించిన పేస్ పురుషుల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో ప్రారంభం నుంచి పై చేయి ప్రదర్శించిన పేస్ తన డబుల్స్ జంటతో కలిసి అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ కారణంగా తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో పేస్‌కు ఎనిమిదో ర్యాంక్ లభించింది.

అదేసమయంలో భారత్‌కు చెందిన మరో డబుల్స్ ఆటగాడు మహేష్ భూపతి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో నిలిచాడు. అమెరికా ఓపెన్‌లో బహమైన్ ఆటగాడు మార్క్ నౌల్స్‌తో కలిసి డబుల్స్ బరిలో దిగిన భూపతి ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో భూపతికి మెరుగైన ర్యాంక్ దూరమైంది.

వెబ్దునియా పై చదవండి