చదరంగానికి కొత్త రూపునిచ్చిన 'ఆ నలుగురు'

సోమవారం, 23 జూన్ 2008 (17:59 IST)
FileFILE
ఎత్తులు పైఎత్తులతో, మేధస్సుకు క్షణంక్షణం పదును పెడుతూ ఆడే ఆటఏదైనా ఉందంటే.. అది చదరంగం పోటీ అని చెప్పారు. అయితే ఈ క్రీడను ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే ఆడేవారు. కానీ కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు యువకులు తమ మేధస్సుతో చదరంగానికి సరికొత్త క్రీడావేదికను తయారు చేశారు. అదేనండీ.. నలుగురు వ్యక్తులు ఏకకాలంలో ఆడేలా చెస్ బోర్డును సృష్టించారు.

మొత్తం 196 గడులతో కూడిన ఈ చెస్ బోర్డులో నలుగురు రాజులు, నలుగురు మంత్రులు, త్రివిధ దళాలు ఉంటాయి. ఎరుపు, నలుపు, తెలుపు, గ్రీన్ రంగుల్లో పావులను తయారు చేశారు. ఏకకాలంలో నలుగురు ఒకే సారి ఎలాంటి ఆటంకాలు లేకుండా చెస్‌ను ఆడొచ్చు. ఈ చెస్ క్రీడా వేదికకు పేటెంట్ కోసం దరఖాస్తు చేయనున్నట్టు ఆ నలుగురు యువకులు చెప్పారు. దీన్ని గిన్నీస్ బుక్‌లో ఎక్కించేందుకు కృషి చేస్తామని విజయ్, నవీన్, హరికిరణ్, కె.విజయ్ అనే నలుగురు యువకులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి