నెంబర్ వన్ కంటే గ్రాండ్‌శ్లామ్ నెగ్గడమే బెటర్: జస్టిన్ హెనిన్

FILE
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కంటే గ్రాండ్‌శ్లామ్ నెగ్గడమే బెటర్ అని బెల్జియం క్రీడాకారిణి, మాజీ ప్రపంచ నెంబర్ వన్ జస్టిన్ హెనిన్ అభిప్రాయపడుతోంది. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను మట్టికరిపించిన హెనిన్, నెంబర్ వన్ స్థానానికంటే గ్రాండ్‌శ్లామ్ గెలవడమే తనకు హ్యాపీగా ఉంటుందని చెప్పింది.

అత్యధిక గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను గెలుచుకోవడంతోనే గొప్పగా ఫీలవుతానని హెనిన్ చెపుతోంది. మాజీ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిలు జెలీనా జంకోవిక్, దినారా సఫీనాలు గ్రాండ్‌శ్లామ్ నెగ్గకనే అగ్రస్థానంలో నిలిచారు.

2003వ సంవత్సరంలో నెంబర్ వన్ ర్యాంకును సాధించడంతో ఎంతో సంతోషపడ్డా. ఎందుకంటే ఆ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలతో గ్రాండ్‌శ్లామ్‌లతో నెంబర్ వన్ ర్యాంకు స్థానాన్ని సొంతం చేసుకున్నాను. అప్పుడే నాలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారిణి అనే భావన కలిగిందని హెనిన్ చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి