భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు అనుకూలించని 2011..

శుక్రవారం, 16 డిశెంబరు 2011 (15:26 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు 2011 ఆశించిన ఫలితాలనివ్వలేదనే చెప్పాలి. ఫామ్‌కోసం పోరాడుతున్న సైనా నెహ్వాల్ ఈ ఏడాది అభిమానులను నిరాశపరిచింది. జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్పలు వరల్డ్ ఛాంపియన్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న నేపథ్యంలో సైనా నెహ్వాల్ మాత్రం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

గత ఏడాది హ్యాట్రిక్ సృష్టించిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది స్విజ్ గ్రాండ్ ప్రిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు మలేషియా, ఇండోనేషియా సిరీస్‌ల్లో కేవలం రన్నరప్‌గానే మిగిలిపోయింది. గత ఏడాది వరుసగా మూడు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలుచుకున్న సైనా నెహ్వాల్, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

అయితే 2011వ సంవత్సరంలో మాత్రం సైనా నెహ్వాల్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకోలేకపోయింది. అయితే గత ఏడాది అత్యధిక పాయింట్లతో అత్యుత్తమ రెండో ర్యాంకును సైనా నెహ్వాల్ కైవసం చేసుకుంది. ఇకపోతే.. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జ్వాలా-అశ్విని జోడీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణపతకం సాధించిన భారత జంటగా రికార్డు సాధించింది.

అలాగే ఈ జంట కొరియా, చైనా ఓపెన్‌లలో క్వార్టర్స్‌ వరకు పోరాడింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జ్వాలా-దిజు జోడీ గాయంతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్ ఫైనల్స్ వరకు పోరాడగలిగాడు.

వెబ్దునియా పై చదవండి