'ఈనాటి ఆటలన్నీ బలం మీదనో, అదృష్టం మీదనో ఆధారపడి ఉన్నాయి. అలాకాకుండా తెలివితో ఆడే, తెలివిని పెంచే ఆటని రూపొందించగలరా?' అని అడిగాడు. సరేనన్న సిస్సా 64 గడులపై భట, సైనిక, హయ, గజ బలాలతో సాగే ఆటను రూపొందించి, 'చతురంగ' అని పేరు పెట్టాడు.
ఆ ఆటను చూసి మురిసిపోయిన రాజు 'ఇందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోండి' అన్నాడు. దానికి సిస్సా ఏం అడిగాడో తెలుసా? ఆ ఆటని ఆడే పట్టికలో మొదట గడిలో ఒక ధాన్యం గింజని ఉంచి, తరువాత ప్రతి గడికీ వాటి సంఖ్యను రెట్టింపు చేస్తూ 64 గడులకీ ఎన్నవుతాయో అంత ధాన్యాన్ని ఇమ్మని కోరాడు.
మొదట ఆ కోరిక చాలా చిన్నదని భావించిన రాజు ఆ తర్వాత దాన్ని తీర్చడం అసాధ్యమని గ్రహించాడు. ఎందుకో తెలుసా? అలా లెక్కించే ధాన్యం గింజల సంఖ్య 18,445,744,073,709,551,515 అని తేలుతుంది. ఇది ప్రపంచం మొత్తం మీద పండే ధాన్యం గింజల కన్నా ఎన్నో రెట్లు అధికం. అప్పుడు రాజు సిస్సాను ఘనంగా సత్కరించి ఆ ఆటను దేశదేశాల్లో ప్రచారం చేస్తాడు. చెస్ పుట్టుక వెనుక ప్రచారంలో ఉన్న కథ ఇది!