భారత టెన్నిస్ రంగాన్ని దశాబ్ధ కాలంగా ఏలుతున్న మహేష్ భూపతి, బాలీవుడ్ తార లారాదత్తాల క్రిస్టియన్ మత విధానాన్ని అనుసరించి వివాహ తంతు ముగిసింది. గోవాలో జరిగిన ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. మీడియాను అనుమతించలేదు.
వారం రోజుల క్రితం అత్యంత రహస్యంగా వీరి వివాహం జరిగింది. కాగా, శనివారం వీరు గోవాలో హల్‌చల్ చేశారు. క్రిస్టియన్ మత విధానాన్ని అనుసరించి వివాహ తంతును ముగించారు.
గోవాలోని సినెక్వరియమ్ బీచ్‌లో వీరి వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి ‘సంగీత్’ కార్యక్రమంతో ప్రారంభమైన లారా-భూపతి పెళ్లి సందడి శనివారం వరకు కొనసాగింది. ఈ వివాహ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోలాషులు కొత్త దంపతులకు తమ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేశారు.
మహేష్-లారాల వివాహ వేడుకకు సినీ రంగం నుంచి రితేష్ దేశ్‌ముఖ్, దియా మీర్జా, ప్రియాంకా చోప్రా, రవీణా, సెలీనా జైట్లీ, బొమన్ ఇరానీ, డైజనర్స్ రాడ్రిక్స్, మోడల్ మల్హర్‌లతో పాటు తదితరులు హాజరయ్యారు. ఇక టెన్నిస్ రంగం నుంచి రోహన్ బోపన్న, లియాండర్ పేస్ దంపతులు పాల్గొన్నారు.