డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్: 32వ స్థానంలో సానియా

తాజాగా విడుదలైన డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్‌లో భారత సంచలన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా 32వ స్థానాన్ని దక్కించుకుంది. డబుల్స్ విభాగంలో 19వ స్థానంలో ఉన్న 20 ఏళ్ళ సానియా మీర్జా డబుల్స్ విభాగ మ్యాచ్‌ల్లో పొందిన పరాజయాల కారణంగా ర్యాకింగ్స్‌లో దిగజారింది.

అదేవిధంగా భారత్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి 260వ స్థానంలో నిలిచాడు. ఇతడి భాగస్వామి ప్రకాష్ అమృతరాజ్ సింగిల్స్ విభాగంలో ఒకస్థానం ముందుకు సాగి 271వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే విధంగా అసుతోష్ 591వ స్థానం, సునీల్ కుమార్ 595 స్థానంలో నిలిచారు. లియాండర్ పేస్-మహేష్ భూపతి జోడీ 17, 21వ స్థానంలో కొనసాగుతున్నారు.

వెబ్దునియా పై చదవండి