సానియా మీర్జా: రోలాండ్ గారోస్ మిక్స్‌డ్ డబుల్‌లో చుక్కెదురు

శనివారం, 1 జూన్ 2013 (17:59 IST)
FILE
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రోలాండ్ గారోస్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్‌లో చుక్కెదురైంది. ఆరంభంలోనే సానియా మీర్జాకు నిరాశ తప్పలేదు.

స్వీడన్ ఆటగాడు రోబర్ట్ లిండ్సెట్‌తో కలిసి మిక్స్‌డ్ బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆదిలోనే పరాజయంతో ఇంటిదారి పట్టింది.

టాప్‌సీడ్‌గా పోటీపడ్డ సానియా జంటకు 6-2, 6-3తో కారా బ్లాక్ (దక్షిణావూఫికా)-ఖురేషీ (పాకిస్థాన్) జంట షాకిచ్చి రెండోరౌండ్ చేరింది.

వెబ్దునియా పై చదవండి