మెస్సీని ఓడిస్తానన్న సెక్సీ మోడల్... బీచ్‌లో అందాలు ఆరబోస్తూ!

బుధవారం, 2 జులై 2014 (13:36 IST)
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీని కూడా ఓడిస్తానని అర్జెంటీనా మోడల్ ఫియోరెల్లా క్యాస్టిల్లో పందెం కాస్తోంది. మెస్సీ తనతో పోటీ పడితే విజయం తనదేనని అంటోంది. సాకర్ వరల్డ్‌కప్ చూసేందుకు బ్రెజిల్ వచ్చిన ఈ 24 ఏళ్ల మోడల్ బీచ్‌లో బికినీలో ఫుట్‌బాల్ ఆడుతూ బ్రెజిల్ వాసులకు తన అందాలను చూపిస్తోంది. అంతేకాదండోయ్ ఈ భామ అక్కడి కర్రాళ్లను ఫుట్‌బాల్ గేమ్‌లో ఓడిస్తోందట.

బీచ్ సాకర్ ఫ్రీస్టయిల్‌లో ఇప్పటిదికా 800 మంది అబ్బాయిల్ని చిత్తు చేశానని ఆమె చెబుతోంది. బ్రెజిల్.. బీచ్ రెండూ బాగున్నాయ్. ఇప్పటిదాకా ఇక్కడ 800 మంది అబ్బాయిల్ని ఓడించాను. స్వదేశం వెళ్లనున్న నాకు ఈ ఆనందం చాలు. ఇంకా ఎవరైనా నాతో పోటీకి వస్తే స్వాగతిస్తాను. మెస్సీని కూడా ఓడించగలనా? అంటే నిస్సంకోచంగా ఎస్ అని చెబుతాను అనంటోంది ఈ సుందరి.

వెబ్దునియా పై చదవండి