జార్జినా, రొనాల్డో 2016లో స్పెయిన్‌లో కలుసుకున్నారు. అప్పుడు జార్జినా ఒక గూచీ దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేసేవారు. అప్పుడు వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఈ స్నేహం 2017లో ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఈ జంటకు అలనా మార్టినా, బెల్లా అనే ఆడపిల్లలు పుట్టారు.
రొనాల్డోకు ఉన్న మరో ముగ్గురు పిల్లలను కూడా జార్జినా పెంచుతున్నారు. 2022లో ఈ జంటకు కవలలు పుట్టారు. వారిలో ఒక మగపిల్లవాడు చనిపోయాడు. ఈ ఘటనతో రొనాల్డో, ఆయన ప్రేయసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సమయంలో క్రిస్టియానో రొనాల్డో తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతూ, చాలా విలువైన వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు.
జార్జినా కూడా సరే అని సమాధానం ఇచ్చి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఈ జంటకు త్వరలో వివాహం జరగనుంది. క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాలోని అల్-నాసర్ అనే జట్టు తరఫున ఆడుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాలోని అల్-నాసర్ అనే జట్టు తరఫున ఆడుతున్నారు.