సానియా మీర్జా ఆ యాడ్ నుంచి తప్పుకోవాలి.. అల్టిమేటం జారీ చేసిన సీఎస్ఈ

బుధవారం, 23 మే 2018 (09:56 IST)
అడ్వర్టైజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) నిబంధనలకు విరుద్ధంగా.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నటిస్తున్న యాడ్ వుందని.. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) అల్టిమేటం జారీ చేసింది. ఇంకా సానియా మీర్జా పౌల్ట్రీ ప్రకటన నుంచి తప్పుకోవాలంటూ సీఎస్ఈ అల్టిమేటం జారీ చేసింది. అలాగే ఏఎస్సీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల్లో నటించరాదని తెలిపింది. 
 
సానియా మీర్జా నటిస్తున్న పౌల్ట్రీ యాడ్ ప్రమాణాలకు విరుద్ధంగా వుందని, కోడిమాంసం ఉత్పత్తులలో యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయంటూ 2014లో సీఎస్ఈ ఇచ్చిన నివేదికను అపహాస్యం చేసేలా వుందని సీఎస్ఈ అధికారి చెప్పారు. అలాగే క్రీడాకారణిగా యువతలవో స్ఫూర్తిని నింపే సానియా మీర్జా ఇలాంటి ప్రకటనల్లో నటించడం మంచిది కాదని తెలిపారు. 
 
అందుచేత సానియా మీర్జా ఈ ప్రకటన నుంచి తప్పుకోవాలని.. లేకుంటే అడ్వర్టైజ్‌మెంట్‌ను కొత్తగా రూపొందించాలని డిమాండ్ చేశారు. కాగా సానియా మీర్జా ప్రస్తుతం గర్భం ధరించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా సానియా టెన్నిస్‌కు దూరమైన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు