ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన నోవాక్ జకోవిచ్, సెరెనా

శుక్రవారం, 3 జూన్ 2016 (12:25 IST)
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లలో టాప్ సీడ్ ఆటగాళ్లు మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జకోవిచ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఏడో సీడ్ థామస్ బెర్డిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3, 7-5, 6-3 పాయింట్ల తేడాతో గెలుపొందిన నోవాక్ జకోవిచ్ సునాయాసంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. 
 
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా ఆద్యంతం మెరుగ్గా ఆడినప్పటికీ చెమటోడ్చి గెలుపును నమోదు చేసుకుంది. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ సెరెనా 5-7, 6-4, 6-1తో పుటింట్‌సెవా (కజకిస్థాన్‌)ను మట్టి కరిపించింది.  ఓడించింది. తొలి సెట్‌ను కోల్పోయినా.. మలి రెండు సెట్లలో పైచేయిగా నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి