సింధుకు, సానియాకున్న సపోర్ట్ నాకెక్కడిది: గుత్తా జ్వాల ఫైర్

శనివారం, 19 నవంబరు 2016 (10:45 IST)
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఆటతో పాటు వివాదాలను వెనకేసుకొస్తుంది. తాజాగా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధు గురించి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌‌పై విమర్శలు గుప్పించింది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధుకు, టెన్నిస్‌లో సానియా మీర్జాకు లభించిన మద్దతు తనకు లభించలేదని గోపిచంద్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటిదాకా తాను ప్రభుత్వాన్ని డబ్బులు అడగలేదని.. ఎలాంటి అవార్డులను ఆశించలేదని గుత్తా జ్వాలా వెల్లడించింది.
 
క్రీడాకారుడి కుటుంబ సభ్యులు ఎవరైనా కష్టపడతారు. సింధు, సానియా ఫ్యామిలీలు అంతే. కానీ తాను తన ఆటతోనే ఎదిగాను. తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని జ్వాల చెప్పుకొచ్చింది. అలాగే బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సింధుకు డబుల్స్‌ను సపోర్ట్‌ చేయరని వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి