సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

ఠాగూర్

బుధవారం, 16 జులై 2025 (10:26 IST)
తన పర్యటనలో చీలి సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి చనిపోయిన ఘటనపై తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. 
 
ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. మంగళవారం విచారణ సమయంలో వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. 
 
కాగా, వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో వైకాపా కార్యకర్త సింగయ్ కారు కిందపడి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై జగన్‌తో పాటు కారు డ్రైవర్, పలువురు వైకాపా నేతలను నిందితులుగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు