ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన రిలీజ్ కానుంది. నిజానికి ఈ చిత్రం ఎపుడో రిలీజ్ కావాల్సి వుంటుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా షూటింగ్ చాలా టైమ్ తీసుకుందని కొందరు అంటున్నారని, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఉంటూనే సినిమాకు చాలా సమయాన్ని కేటాయించారని చెప్పింది. ఆయన ఎంతో శ్రమించారని తెలిపింది. మూవీకి అంత సీన్ లేదని, అందుకే లేట్ ఆవుతోందని, కామెంట్స్ వచ్చాయని, ట్రైలర్ వచ్చాక వాటికి చెక్ పడిందని, నిధి అగర్వాల్ వ్యాఖ్యానించింది. సినిమా అద్భుతంగా ఉందనే కామెంట్స్ ఇపుడు వస్తున్నాయని, అందుకే ఎపుడు కూడా పుకార్లను నమ్మరాదని చెప్పింది. మరోవైపు, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 20వ తేదీ తేదీన వైజాగ్ వేదికగా నిర్వహించనున్నారు.