తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, మహాబలిపురం వేదికగా జరిగిన 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ పోటీల్లో తొమ్మిది నెలల నిండు గర్భిణి కాంస్య పతక విజేతగా నిలిచారు. ఆమె పేరు ద్రోణవల్లి హారిక. మన తెలుగమ్మాయి. 9 నెలల గర్భిణీగా ఉంటూ ఈ పోటీలకు ఆమె హజరయ్యారు. కాంస్య పతకాన్ని సాధించిన చెస్ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె ఫోటోను సినీ దర్శకుడు బాబి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
ఇంతకీ సినీ దర్శకుడు బాబీ హరితకు స్వయానా బావ. 9 నెలల గర్భంతో మెడలో తాను గెలిచిన పతకాన్ని వేసుకుని హారిక తీయించుకున్న ఫోటోను పోస్ట్ చేసిన బాబి... చెస్ పట్ల ఆమెకున్న అంకితభావాన్ని కీర్తించారు. దేశం కోసం ఏదో సాధించాలన్న హారిక తపన, ఆమెలోని పోరాట పటిమ తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.