నేను రియోకు వెళ్ళకుండా వుండాల్సింది.. సైనా సెన్సేషనల్ కామెంట్స్

శనివారం, 26 ఆగస్టు 2017 (17:17 IST)
మోకాలి గాయాల కారణంగానే రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుచలేకపోయానని.. ఇప్పటికే తన కుడి మోకాలిలో సమస్య వుందని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా వుండి వుంటే బాగుండేదని సైనా వెల్లడించింది. రియో సందర్భంగా తనకున్న గాయాల గురించి తనకు మాత్రమే తెలుసునని.. తల్లిదండ్రులు, కోచ్ మద్దతుతో ఫిజికల్ ఫిట్‌గా ఉన్నట్లు అనుకున్నాను. 
 
కానీ అసలు విషయం అక్కడికెళ్లాకే తెలిసింది. వారి నమ్మకం వమ్ము అవుతుందని అనుకోలేదు. తాను అసలు రియోకు వెళ్లకుండా వుండి వుంటే బాగుండేదని సైనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన సైనా నెహ్వాల్.. జపాన్‌కు చెందిన నోజోమీ ఒకోహారాతో తలపడనుంది. 
 
మరో సెమీఫైనల్లోకి హైదరాబాదీ మరో బ్యాడ్మింటన్ స్టార్, రియో కాంస్య పతక విజేత పీవీ సింధు కూడా అడుగుపెట్టింది. వీరిద్దరూ సెమీఫైనల్లో తమ తమ ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తే.. ఫైనల్లో అమీతుమీగా పోటీపడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు