ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. స్థానిక ప్లేయర్ 16వ సీడ్ క్రిస్టీ గిల్‌మోర్‌తో జరిగిన క్యార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సైనా 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆద్యంతం సైనా మెరుగ్గా రాణించింది. తొలిగేమ్‌ను గెలిచి రెండో గేమ్‌ను ఓడినా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను సైతం సొంతం చేసుకుంది. తద్వారా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.
అంతకు ముందు తెలుగు తేజం, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ షట్లర్ పీవీ సింధు అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి చైనా షట్లర్ సన్‌యూపై 21-14, 21-9తో సింధు గెలుపును నమోదు చేసుకుని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో రెండు సార్లు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం అందుకుంది. తాజాగా సింధుకు మూడో సారి పతకం ఖాయం చేసుకుంది.