దుబాయ్ కార్ రేసింగ్ పోటీలు : హీరో అజిత్ జట్టుకు మూడో స్థానం!
తమిళ హీరో అజిత్ కుమార్ కొన్నిరోజులుగా దుబాయ్‌లో జరుగుతున్న దుబాయ్ 24 హెచ్ కార్ రేస్‌లో తన టీంతో కలిసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆదివారం జరిగిన 24 హెచ్ కార్ రేసింగ్ పోటీల్లో అజిత్ టీం విజయాన్ని అందుకుంది. హోరా హోరిగా సాగిన ఈ రేసింగ్‌లో ఆయన టీం 901 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది.