అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీ: మెస్సీ ఖాతాలో మరో రెండు రికార్డులు.. 54 గోల్స్ రికార్డ్ బ్రేక్!

బుధవారం, 22 జూన్ 2016 (14:49 IST)
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రికార్డుల పంట పండిస్తున్నాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండు రికార్డులను సాధించడం ద్వారా మెస్సీ అర్జెంటీనాను ఫైనల్లోకి దూసుకెళ్లేలా చేశాడు.

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచిన మెస్సీ.. అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా రికార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా గాబ్రియల్ బటీస్టుటా 54 గోల్స్ రికార్డును మెస్సీ అధిగమించాడు. 
 
ఇకపోతే, అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 4-0 తేడాతో జట్టు గెలిపించాడు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ, తాను బటీస్టుటా రికార్డును బ్రేక్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త రికార్డులను నమోదు చేసేందుకు గాను తనకు సహకరించిన తమ జట్టు సభ్యులకు కృతజ్ఞతలంటూ మెస్సీ వ్యాఖ్యానించాడు.

శుక్రవారం 29వ ఏట అడుగుపెట్టే లియోనల్ మెస్సీ ఫైనల్లోనూ మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని చెప్పాడు. కాగా చికాగోలో బుధవారం జరిగే ఫైనల్స్‌లో చిలీతోగానీ, కొలంబియాతోగానీ అర్జెంటీనా తలపడాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి