ఒలింపిక్స్‌లో బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా ఓటమి

బుధవారం, 4 ఆగస్టు 2021 (12:05 IST)
Lovlina Borgohain
ఒలింపిక్స్‌లో బాక్సింగ్ సెమీస్‌లో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ ఓటమి పాలైంది. దాంతో ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో లవ్లీనా ఓడిపోయింది. మూడు రౌండ్లలోనూ టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా నిర్ణయించారు. దాంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 
 
ఈ ఒలింపిక్స్ భారత్ కు ఇది మూడో మెడల్ కాగా.. ఒలంపిక్స్‌లో బాక్సింగ్‌లో ఇండియాకు వచ్చిన మూడో మెడల్ కూడా ఇదే. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వర్‌, బ్యాడ్మింటన్‌లో సింధు బ్రాంజ్ మెడల్ గెలవగా.. ఇప్పుడు బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్ మరో బ్రాంజ్ మెడల్ సాధించింది. అలాగే గతంలో ఒలంపిక్స్ బాక్సింగ్ లో విజేందర్‌, మేరీకోమ్ కూడా కాంస్య పతకాలు సాధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు