టోక్యో ఒలింపిక్స్ : మూడోసారి సత్తా చాటిన మనూ భాకర్

గురువారం, 29 జులై 2021 (14:14 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న భారత షూటర్ మనూ భాకర్ రెండుసార్లు పూర్తిగా నిరాశపరించింది. కానీ, మూడోసారి సత్తా చాటింది. మూడోసారి క్వాలిఫికేషన్ రౌండ్‌లో అదరగొట్టి టాప్-5లో చోటుదక్కించుకుంది. తద్వారా తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 
 
తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె ట్రిగ్గర్ మొరాయించడంతో అవకాశం కోల్పోయిన మనూ భాకర్.. ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది.
 
కానీ, గురువారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం పోటీల్లో ఆమె గెలిచి నిలిచింది. 44 మంది మహిళా షూటర్లు పాల్గొన్న ఈవెంట్‌లో ఆమె 592 పాయింట్లు సాధించింది. పదికి పది పాయింట్లను 9 సార్లు సాధించింది. గురి చూసి ఇన్నర్ రింగ్‌లో కాల్చింది.
 
అయితే, ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ అయిన రాహీ సార్నోబత్ మాత్రం నిరాశపరిచింది. మూడు సిరీస్‌ల క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె 287 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె క్వాలిఫికేషన్ రౌండ్ నుంచి నిష్క్రమించింది. ఇక, ఈ ఇద్దరు రేపు జరిగే పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌‌లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు