నీరజ్ చోప్రా అదుర్స్.. డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత

సెల్వి

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (15:17 IST)
పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, 14 సిరీస్ సమావేశాల ముగింపు తర్వాత ఓవరాల్ స్టాండింగ్‌లలో నాల్గవ స్థానంలో నిలిచి బ్రస్సెల్స్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.
 
ఈ ఈవెంట్ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనుంది. మొదటి మూడు స్థానాల్లో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ (29 పాయింట్లు), జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ (21 పాయింట్లు), చెక్ రిపబ్లిక్ స్టార్ జాకుబ్ (16 పాయింట్లు) ఉన్నారు.
 
26 ఏళ్ల నీరజ్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన రెండవ భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో, నీరజ్ గజ్జ గాయంతో ఇబ్బంది పడ్డాడు.
 
నీరజ్ చోప్రాకు డైమండ్ లీగ్‌లో పెద్దగా పోటీ లేదు. నీరజ్ ఇప్పటివరకు రెండు సీజన్లలో మాత్రమే డైమండ్ లీగ్‌లో పాల్గొన్నాడు. దోహాలో 88.86 మీటర్లు, లుసాన్నెలో 89.49 మీటర్లు విసిరాడు. బ్రస్సెల్స్‌లో 90 మీటర్ల మార్క్ అందుకోవాలన్నది ఆయన తదుపరి లక్ష్యం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు