ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ అనూహ్య ఓటమి.. రఫెల్ నాదల్ గెలుపు

గురువారం, 8 జూన్ 2017 (09:34 IST)
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థీమ్ చేతిలో అనూహ్య రీతిలో జకోవిచ్ పరాజయం పాలయ్యాడు. పురుషుల క్వార్టర్ ఫైనల్లో తొలి సెట్లో తనదైన శైలిలో రాణించినా, తొలి సెట్‌ను 6-7 (5-7) తేడాతో, రెండో సెట్ లో 3-6 తేడాతో ఓడాడు. తప్పనిసరిగా గెలిచి ఆటలో నిలవాల్సిన మూడో సెట్లో దారుణంగా విఫలమయ్యాడు. 
 
మూడో సెట్‌లో 0-6 తేడాతో ఓడిన జకోవిచ్ సెమీఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి వెనుదిరిగాడు. థీమ్ ముందు జకోవిచ్ ఓ అన్ సీడెడ్ ఆటగాడిగా కనిపించాడని మ్యాచ్ తరువాత ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు. ఇకపోతే.. పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌పై కన్నేసిన రఫెల్ నాదల్, క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి బుస్టాపై విజయం సాధించాడు. బుస్టా గాయంతో నిష్క్రమించడంతో నాదల్ గెలుపు సునాయాసమైంది.

వెబ్దునియా పై చదవండి