ప్రపంచ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌: బహిష్కరణకు గురైన తెలుగమ్మాయి

బుధవారం, 19 అక్టోబరు 2022 (11:53 IST)
Priyanka
ప్రపంచ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు అమ్మాయి బహిష్కరణ చేదు అనుభవం ఎదురైంది. ఇటలీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆడుతున్న ఈ విజయవాడ గ్రాండ్‌మాస్టర్‌ నూతక్కి ప్రియాంక టోర్నీ నుంచి బహిష్కరణకు గురైంది.

మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌కు ప్రియాంక పొరపాటున తన జేబులో మొబైల్‌ ఇయర్‌ బడ్స్‌తో వచ్చింది. చెకింగ్‌లో ఆమె జాకెట్‌లో ఇయర్ బడ్స్ బయటపడటంతో ఆటను రద్దు చేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. 
 
ఫౌల్‌ గేమ్‌ ఆడనప్పటికీ ఫిడే నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నూతక్కి ప్రియాంక బహిష్కరణకు గురైంది. ఈ బహిష్కరణ అంశంపై భారత చెస్‌ సంఘం అధికారులు అప్పీల్‌ చేసినా ఫిడే వెనక్కి తగ్గలేదు. 
 
కాగా గేమ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరన్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ గేమ్ ను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఏకంగా టోర్నీ నుంచి బహిష్కరణకు గురికావడంతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది.  
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు